Breaking News

పెళ్లి చేసుకోవాలని కోరిన గర్భిణి.. గొంతు నులిమి చంపేసిన మేకల వ్యాపారి


పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేసి దారుణంగా చంపేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపత్తూరు జిల్లాలోని సెదువలై ప్రాంతానికి చెందిన శ్రీనుకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. మేకల వ్యాపారం చేసే అతడికి కొన్నాళ్ల క్రితం ఓ యువతి పరిచయమైంది. మాయమాటలతో ఆమెను నమ్మించిన శ్రీను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అంబూరు ప్రాంతంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం మొదలుపెట్టాడు. తనకు పెళ్లయిన విషయం యువతికి, ఆమెతో సహజీవనం చేస్తున్న సంగతి భార్యకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. Also Read: రెండేళ్ల సహజీవనం తర్వాత యువతి ఇటీవల గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని శ్రీనును డిమాండ్ చేస్తోంది. ప్రతిసారీ ఏదొకటి చెప్పి శ్రీను తప్పించుకోవడంతో పెద్దల్లో పంచాయతీ పెడతానని బెదిరించింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్న శ్రీను పథకం వేశాడు. చాముండి అమ్మన్‌ ఆలయ తిరునాళ్లకు తీసుకెళ్తానని శనివారం శ్రీను ఆ యువతిని బయటకు తీసుకెళ్లాడు. సాయంత్రం వేళ రాతి క్వారీ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. Also Read: క్వారీ వద్ద యువతి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా ఆమెకు శ్రీను నుంచి ఆఖరి కాల్ వచ్చినట్లు తెలుసుకున్నారు. అతడొ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారగా సెదువలైలోని అత్తారింట్లో ఉన్న నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆమెను తానే చంపినట్లు శ్రీను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By March 09, 2020 at 11:02AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-man-arrested-in-tamil-nadu-over-he-kills-girl-friend/articleshow/74546347.cms

No comments