Breaking News

ఏడేళ్ల బాలికకు సెక్స్ వీడియోలు చూపించి అత్యాచారం.. గూడూరులో దారుణం


మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో జులాయిగా తిరిగే పుప్పాల సందీప్‌ అనే యువకుడు 10 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక(7)కు సెల్‌ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించి లోబరుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. Also Read: ఈ నెల 9వ తేదీన సందీప్ మరోసారి బాలికను భవనంపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించగా స్థానిక యువకులు గమనించి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ మరుసటిరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్‌ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ నరేశ్‌కుమార్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి గౌతం ఈ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. Also Read:


By March 13, 2020 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-in-mahabnagar-over-raped-7-old-girl/articleshow/74604949.cms

No comments