Breaking News

వితంతువుతో అక్రమ సంబంధం.. ఆమె మరిది, కొడుకు చేతిలో దారుణహత్య


భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో పెట్టుకున్న ఓ వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైన ఘటన జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట మండలం బాలెం గ్రామానికి చెందిన తాడూరి రవి(41) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోవడంతో కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో రవితో ఆమెకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. రవి తరుచూ ఆమె ఇంటికి వెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఉండేవాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న మహిళ కొడుకు, మరిది పద్ధతి మార్చుకోవాలని రవిని మందలించారు. అయినప్పటికీ ప్రియురాలిపై మోజు చావని రవి వారి మాటలను పట్టించుకోలేదు. శనివారం అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లిన రవిపై ఆమె కొడుకు, మరిది కలిసి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి రవి వెళ్లిన వెంటనే ఆగ్రహంతో బండలు కొట్టే గన్నుతో దాడి చేశారు. రవి కిందపడిన తర్వాత బండరాయితో తలపై మోదారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. Also Read: అనంతరం మహిళపై సైతం దాడి చేయటానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నారు. రవిని హత్య చేసిన తర్వాత నిందితులిద్దరూ రేఖ్యా తండా వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఎదురుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసి వస్తున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రవి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు సూర్యాపేట గ్రామీణ ఎస్సై ఎ.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 23, 2020 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-man-brutally-killed-in-suryapet-district-over-illicit-affair-with-widow/articleshow/74766532.cms

No comments