ఆంటీతో భర్త అక్రమ సంబంధం.. పెళ్లయిన ఏడాదికే యువతి ఆత్మహత్య

వివాహేతర సంబంధం ఓ యువతి ప్రాణం తీసింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆమె భర్తకు వేరే మహిళతో ఉందని తెలిసి తట్టుకోలేకపోయింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని భర్తను నిలదీసింది. కానీ అతడిలో మార్పు రాకపోవడంతో పాటు మరింత రెచ్చిపోవడంతో చావే శరణ్యమనుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది. Also Read: మైసూరులోని టీకే లేఔట్‌లో బసవరాజ్‌కు లేఖన(25) అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఇద్దరూ ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే బసవరాజ్ తన కంటే వయస్సులో పెద్దదైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యను పట్టించుకోకుండా ఎక్కువ సమయం ప్రియురాలితోనే గడిపేవాడు. భర్త వ్యవహారం గురించి తెలుసుకున్న లేఖన తనను ఎందుకు మోసం చేస్తున్నావని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన అతడు తన ఇష్టం వచ్చినట్లు ఉంటానని, నీతో కాపురం చేయాలంటే మరింత కట్నం తీసుకురా.. అంటూ లేఖను వేధించాడు. Also Read: భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో లేఖన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దంపతులిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కూడా బసవరాజ్ పద్ధతి మార్చుకోకుండా ప్రియురాలితో తిరుగుతుండటంతో లేఖన తట్టుకోలేకపోయింది. భర్తలో మార్పు రాదని నిర్ధారించుకుని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బసవరాజ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read:
By March 29, 2020 at 11:23AM
No comments