Breaking News

రెండేళ్లు సహజీవనం చేసి మరో యువతితో పెళ్లి.. నిలదీసిన పాపానికి


పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో రెండేళ్లు సహజీవనం చేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న యువకుడిపై కేసు నమోదైంది. పాతబస్తీ మల్లేపల్లిలోని మాంగార్‌బస్తీకి చెందిన రహీం(35) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన యువతి(25)ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సంవత్సరాల పాటు ఇంట్లోనే సహజీవనం చేశాడు. Also Read: గతేడాది డిసెంబర్‌ 20న మరో యువతిని పెళ్లి చేసుకొని ఇంట్లోనే కాపురం పెట్టాడు. దీంతో మొదటి యువతి నిలదీయగా ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రహీంతో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By March 05, 2020 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-booked-for-cheating-woman-for-pretext-of-marriage/articleshow/74486452.cms

No comments