Breaking News

విశాఖ: సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. మహిళతో దొరికిన జబర్దస్త్ కమెడియన్స్


విశాఖలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 201 ప్లాట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఓ మహిళతో పాటూ నలుగురు విటుల్ని అరెస్ట్ చేశారు.. ఐదుగుర్ని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మాధవధారలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజులుగా వ్యభిచారం గుట్టుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు దొరికిపోయిన వారిలో దొరబాబు, పరదేశితో పాటూ మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హైపర్ ఆది టీమ్‌లో కమెడియన్స్‌గా చేస్తున్నారు. వీరితో పాటూ దొరికిన మరో ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో కొద్దిరోజులుగా వ్యభిచార దందాలు పెరిగిపోయాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి.. ఎప్పటికప్పుడు ఆట కట్టిస్తున్నారు. అయినా సరే అపార్ట్‌మెంట్లను అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. కానీ ఈసారి జబర్దస్త్ నటులు దొరికిపోవడం సంచలనంగా మారింది.


By March 04, 2020 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-vizag-jabardasth-comedians-arrested/articleshow/74471337.cms

No comments