ప్రేమజంట ఆత్మహత్య.. ఒకే చున్నీతో చెట్టుకు వేలాడిన ప్రేమికులు

తమ ప్రేమను పెద్దలు, సమాజం అంగీకరిస్తుందా? లేదా? అన్న అనుమానంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి నకిటిసిమడ పంచాయతీ కడియపారా గ్రామంలో చోటుచేసుకుంది. Also Read: గ్రామానికి చెందిన రంభగోడో(17), అమల్‌సింగ్‌గోడో(22) కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ఈ క్రమంలోనే ఒకరి ఇంటికి మరొకరు వచ్చి వెళ్తుండటంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పగా వారు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇళ్ల నుంచి గ్రామశివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒకరినొకరు కౌగిలించుకుని చున్నీతో చెట్టుకు ఉరేసుకుని చేసుకున్నారు. Also Read: మంగళవారం ఉదయం రంభగోడో ఇంటిలో కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అమల సింగ్ ఇంటికి వెళ్లి చూశారు. అతడు కూడా రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు చెప్పడంతో వారిద్దరి కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. ఇద్దరూ ఒకే చెట్టుకు ఉరేసుకుని వేలాడటాన్ని గమనించి కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సమాచారంతో రాయిఘర్ ఐఐసీ సరిత మహాపాత్ర, ఎస్‌ఐ జ్ఞానేశ్వర్‌మాఝి ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. Also Read:
By March 04, 2020 at 08:56AM
No comments