Breaking News

కరోనా హెల్మెట్: ఇప్పుడైనా మారండి బాబూ.. ఐడియా అదిరిందిగా


దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల 14న జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు కొంత సమయం కేటాయించారు. ఇక సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. నిబంధనలు అమలు చేస్తున్నా కొందరు ఆకతాయిలు మాత్రం రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసులు ముందు పద్దతిగా చెప్పి చూస్తున్నారు.. కొన్నిచోట్ల మాత్రం తమ లాఠీలకు పనిచెబుతున్నారు. నాలుగు తగిలించి మరీ బుద్ది చెబుతున్నారు. తమిళనాడులో మాత్రం రోడ్లపైకి వస్తున్న జనాలకు పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా రూల్స్ అతిక్రమించి.. అకారణంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారికి, బైక్స్‌పై ఇద్దరు వెళ్లినా ఆపుతున్నారు. కరోనా ప్రభావం ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వినూత్నంగా రూపంలో డిజైన్ చేసిన హెల్మెట్ పెట్టుకుని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తే పరిస్థతి చాలా తీవ్రంగా ఉంటుందని.. దయచేసి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం ముఖ్యమంటుూనే.. హెల్మెట్ పెట్టుకుంటే కళ్లు, ముక్కు, నోరు, చెవులను మూసేస్తుందని గుర్తు చేస్తున్నారు. తమిళనాడులో పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం మంచి సత్ఫలితాలు ఇస్తోంది. జనాల్లో అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నామని పోలీసులు చెబుతున్నారు.


By March 28, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-cop-create-awareness-to-people-with-coronavirus-helmet/articleshow/74857473.cms

No comments