Breaking News

కరోనా వైరస్‌పై మోదీ మన్ కీ బాత్


కరోనాపై మరోసారి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని మోదీ. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనా గురించి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఈ కార్యక్రమం ద్వారా మోడీ చెప్పనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనిపై ఆయన పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు నెలల కార్యాచరణ ప్రకటించింది. మీ మొబైల్ లో మన్ కీ బాత్ వినాలి అనుకుంటే 1922కు మిస్‌డ్ కాల్ ఇస్తే చాలు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, నరేంద్రమోదీ మొబైల్ యాప్ లలో వినవచ్చు. హిందీ భాషలో ప్రసంగించే ప్రధాని ఉపన్యాసాన్ని అనంతరం ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లోనూ వినవచ్చు. ని కట్టడి చేయడానికి గానూ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. జనతా కర్ఫ్యూ లాక్ డౌన్ ని ప్రకటించిన మోడీ ప్రత్యేక ప్యాకేజి కూడా పేదలకు అందించారు. పేదల కోసం ఒక లక్షా 70 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కరోనా వైరస్ కట్టడి విషయంలో చాలా దేశాల ప్రధానులు విఫలం అయినా వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని చాలా జాగ్రత్తలు వ్యవహరిస్తున్నారు. జనతా కర్ఫ్యూ విషయంలో దేశం మొత్తం ఆయన మాట విని ఇంటికే పరిమితం అయింది. ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. దేశవ్యాప్తంగా ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు అమలు కానుంది.


By March 29, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-narendra-modis-mann-ki-baat-with-the-nation/articleshow/74869457.cms

No comments