Breaking News

ప్రేమన్నాడు.. లొంగదీసుకుని వదిలేశాడు.. ఆస్పత్రిలో యువతి


ప్రేమిస్తున్నానని నమ్మించి శారీరకంగా వాడుకుని ఇప్పుడు పెళ్లికి ప్రియుడు మొహం చాటేయడంతో తట్టుకోలేకపోయిన యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువతి డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. స్థానిక గణేష్‌నగర్‌కు చెందిన డి.శివకుమార్‌ ఆమెను ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. అతడి ప్రవర్తన నచ్చడంతో ఆమె కూడా ఓకే చెప్పేసింది. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సినిమాలు, పార్కుల వెంట తిరుగుతూ శారీరకంగానూ కలిశారు. Also Read: యువతి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని శివకుమార్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై ఎన్నోసార్ల లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల శివకుమార్ తనను దూరం పెట్టడంతో ఆమెకు అనుమానం వచ్చి నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ‘నువ్వు ఎవరో నాకు తెలియదు.. నేను నిన్ను పెళ్లి చేసుకోను’ అని ముఖంపైనే చెప్పేశాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలి క్యారెక్టర్‌పై చెడు ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఈ Also Read: ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతితో శివకుమార్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వేధించాడు. ఆమె ఎదురుతిరగడంతో దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి బుధవారం ఉదయం స్థానిక పంపుల చెరువు సమీపంలో ఎలుకల మందు తిని, బ్లేడుతో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను గమనించి వెంటనే ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెప్పారు. తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. Also Read:


By March 19, 2020 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-attempt-to-suicide-in-tadepalligudem/articleshow/74703030.cms

No comments