చికిత్స కోసం వచ్చిన మహిళకు మత్తుమందిచ్చిన డాక్టర్.. గదిలోకి తీసుకెళ్లి

ప్రజలను రోగాలను నయం చేసే డాక్టర్‌ను దేవుడిగా భావిస్తుంటారు. కానీ ఓ డాక్టర్ మాత్రం తన వద్దకు వచ్చిన మహిళా రోగిని కామంతో చూసి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటోంది. గతవారం అనారోగ్యానికి గురైన ఆమె ఒంటరిగా హాస్పిటల్‌కు వెళ్లింది. Also Read: అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న ఓ డాక్టర్ ఆమెను చికిత్స పేరుతో ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇతర సిబ్బంది కూడా లేకపోవడంతో ఆ డాక్టర్‌కు నీచపు కోరిక కలిగింది. ఆ మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ సమయంలో మెలకువ వచ్చిన మహిళ డాక్టర్‌ను ప్రతిఘటించి బయటకు పరుగులు తీసింది. లోపల జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆ కీచక డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. Also Read:
By March 13, 2020 at 10:45AM
No comments