Breaking News

వివాహితతో అఫైర్.. కత్తులతో పొడిచి, మర్మాంగం కోసేసి యువకుడి దారుణహత్య


అక్రమ సంబంధాలు ప్రాణాలను బలి కోరుతున్నాయి. తాత్కాలిక ఆకర్షణలో పడిపోతున్న కొందరు జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. ఈ బండారం బయటపడితే ఎవరో ఒకరు ఎదుటివారి ప్రాణాలను తీసి హంతకులుగా మారుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లో ఓ వివాహితతో పెట్టుకున్న యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కత్తులతో నరికి, మర్మాంగం కోసేసి అత్యంత దారుణ స్థితిలో అతడి మృతదేహం కనిపించింది. Also read: రాజస్థాన్‌లోని జల్వార్ జిల్లా డాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాన్ గ్రామ శివారులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. కత్తులతో పొడిచి, మర్మాంగం కోసేసి అతి కిరాతకంగా చంపినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డిప్యూటీ ఎస్పీ రాజ్‌‌పాల్ సింగ్ సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అతడిని అదే గ్రామానికి చెందిన జలీమ్ సింగ్‌గా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also read: పోస్టుమార్టం రిపోర్టులో అతడిని అత్యంత కిరాతకంగా చంపినట్లు తేలింది. తీవ్రంగా కొట్టి కడుపుతో కత్తులతో పొడిచి మర్మాంగాన్ని కోసేసి చిత్రహింసలు పెట్టి చంపినట్లు తేలడంతో అందరూ షాకయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా జలీమ్‌సింగ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉన్నట్లు తేలడంతో ఆ కోణంతో ఆరా తీశారు. చాన్ గ్రామానికే చెందిన సింగ్, స్మార్ట్ సింగ్, నారాయణ్, రామ్‌లాల్ అనే నలుగురు వ్యక్తులు అతడిని చంపినట్లు నిర్ధారించారు. నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. Also read:


By March 12, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-man-brutally-murdered-over-illegal-affair/articleshow/74588184.cms

No comments