Breaking News

మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్య.. మియాపూర్‌లో విషాద ఘటన


మనసిచ్చిన వాడితో కలసి బతకలేక.. విడిచి ఉండలేక మహిళా ఫిజియోథెరపిస్ట్ ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌కి చెందిన తనమ్మయి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తోంది. తన తమ్ముడితో కలసి పరిధిలోని ఆర్‌బీఆర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. సడెన్‌గా నిన్న అర్ధరాత్రి ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరబాద్ వచ్చి ఫిజీయోథెరపిస్టుగా పని చేస్తున్న తన్మయికి ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. తన ప్రేమ విషయాన్ని తన్మయి తల్లిదండ్రులకు చెప్పి అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకు నిరాకరించిన ఆమె తల్లిదండ్రులు తన్మయికి వేరే సంబంధం ఖాయం చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తన్మయి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: నచ్చినవాడితో కాకుండా వేరే వ్యక్తితో వివాహం చేస్తామని తల్లిదండ్రులు తేల్చి చెప్పడంతో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత తన్మయి తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తమ్ముడు తలుపు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. ఫ్యాన్ కు వేలాడుతున్న అక్కని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also:


By March 08, 2020 at 12:50PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-physiotherapist-commits-suicide-in-hyderabad/articleshow/74535698.cms

No comments