Breaking News

బైక్ ఆపిన కానిస్టేబుల్‌పై లాఠీతో దాడి.. శ్రీకాకుళంలో తండ్రీకొడుకుల పైశాచికం


కరోనా కట్టడి కోసం విధించిన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై తండ్రీ కొడుకులు దాడి చేసిన ఘటన జిల్లా కోటబొమ్మాళిలో శనివారం జరిగింది. రైతుబజార్ వద్ద శనివారం కానిస్టేబుల్‌ భైరి జీవరత్నం విధులు నిర్వహిస్తున్నారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వెళ్తుండగా కానిస్టేబుల్‌ ఆపారు. Also Read: దీంతో ఆ తండ్రీ కొడుకులు కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. బైక్ ఎందుకు ఆపావంటూ అతడిపై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ జీవరత్నాన్ని జిల్లా ఎస్పీ కె.అమ్మిరెడ్డి పరామర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. Also Read:


By March 29, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/father-son-beats-police-conistable-in-srikakulam-district/articleshow/74869832.cms

No comments