Breaking News

ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారా.. ఏడాది జైలు శిక్ష: కేంద్రం స్పష్టమైన ఆదేశాలు


కరోనా కట్టడి కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకు ప్రకటిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనాలంతా కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని సూచించారు.. ఈ రాకాసి వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జనాలు ఈ 21 రోజులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఈ మూడు వారాలు ఎవరైనా ప్రభుత్వ నిబంధనల్ని పాటించాల్సిందే. ఒకవేళ ఎవరైనా గీత దాటితే.. సెక్షన్ 51 విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం ఏడాది జైలుతో పాటూ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. మనుషుల ప్రాణాలకు హాని కలిగించే వ్యాధులకు సంబంధించిన వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చేసే చర్యలకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. జనాలు కచ్చితంగా ఈ నిబంధనల్ని పాటించాల్సిందే మరి. అంతేకాదు.. ఈ నిబంధనలు ఉల్లంఘించి కేసులు నమోదైతే.. సెక్షన్ 51 విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం.. అవి కోర్టులో కూడా విచారణకు వెళ్లవు. ఇటు ప్రభుత్వ అధికారులు నోటీసులు పంపి.. నెలలో ఎప్పుడైనా కేసులు నమోదు చేయొచ్చు. లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే.. ఆ తీవ్రతను బట్టి నెల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తారు.. అంతేకాదు శిక్షను ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంది.


By March 25, 2020 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/violating-lockdown-to-invite-a-years-jail-order-issued-by-the-union-home-ministry/articleshow/74802150.cms

No comments