Breaking News

కవలలపై కీచక తండ్రి కామం.. మేనమామ దారుణం.. చలించిపోయిన స్కూల్ టీచర్


రోజురోజుకూ మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వావీవరసలు మరచి సొంతవాళ్లపైనే కామంతో రగిలిపోతున్నారు. ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డలను కూడా వదలట్లేదు కామపిశాచులు. కవల పిల్లలను కన్నతండ్రే కామంతో కాటేసిన దారుణ సంఘటన తెలంగాణలో వెలుగుచూసింది. అదే దారుణమనుకునేలోపే మరో అమానుష ఘటన కలచివేస్తోంది. ఆ బాలికలపై మేనమామ మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల పరిస్థితి విని చలించిపోయిన టీచర్లు ఆ మానవ మృగాల ఆటకట్టించారు. పట్టణంలోని కాశీబుగ్గ శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల వయసున్న కవలలైన కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అక్కాచెల్లెళ్లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కంచె చేను మేసిందన్న చందంగా కవలలపై కన్న తండ్రి, మేనమామ కన్ను పడింది. Also Read: ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మేనమామ మూడేళ్లుగా అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడు. ఏడాది కాలంగా కన్నతండ్రి కూడా అమానుషంగా బాలికలపై అత్యాచారం చేస్తున్నాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లే తమ జీవితాన్ని నాశనం చేస్తున్నారన్న విషయం ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా కుమిలిపోయారు కవల అక్కాచెల్లెళ్లు. Read Also: చివరికి వేధింపులు భరించలేక కవలలు తమపై జరుగుతున్న అఘాయిత్యాన్ని స్కూల్ టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చలించిపోయిన ఉపాధ్యాయులు వెంటనే వరంగల్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కవలలపై అత్యాచారానికి పాల్పడుతున్న కన్నతండ్రి, మేనమామను అదుపులోకి తీసుకుని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By March 07, 2020 at 02:10PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/father-maternal-uncle-rapes-twin-sisters-for-3-years-in-warangal/articleshow/74524961.cms

No comments