Breaking News

బెంగళూరు నుంచి ఆగ్రాకు కరోనా సోకిన గూగుల్ ఉద్యోగి భార్య.. ఆమెకూ కోవిడ్


బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో పనిచేసే ఉద్యోగికి ఉన్నట్టు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా, బాధితుడి భార్యకు కూడా వైరస్ ఉన్నట్టు తేలింది. కొత్తగా వివాహమైన ఈ దంపతులు ఇటీవలే హనీమూన్ కోసం ఇటలీ వెళ్లివచ్చినట్టు అధికారులు తెలిపారు. భర్తకు కోవిడ్ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను క్వారంటైన్‌లో ఉంచారు. ఈమె మార్చి 8న బెంగళూరు నుంచి తన తల్లిదండ్రులతో విమానంలో ఢిల్లీకి చేరుకుని, అక్కడ నుంచి ఆగ్రాకు రైల్లో ప్రయాణించినట్టు గుర్తించారు. కేవలం ఆమె మాత్రమే కాదు, కుటుంబంలో ఎనిమిది మందిని హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. వారి ఇంటి నుంచి తరలించడానికి జిల్లా కలెక్టర్ పోలీసుల సాయం తీసుకున్నారు. ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ముఖేశ్ కుమార్ వాట్సా మాట్లాడుతూ.. బాధిత మహిళ ఇంటికి తొలుత వైద్యుల బృందం వెళ్లగా పరీక్షలు చేయించుకోడానికి వారు నిరాకరించారని అన్నారు. రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి కూడా సహకరించడానికి అంగీకరించలేదన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో మొత్తం తొమ్మిది కుటుంబసభ్యులను జిల్లా హాస్పిటల్‌కు తరలించామని అన్నారు. ప్రస్తుతం ఆ మహిళను ఎస్ఎన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలియజేశారు. కరోనా సోకిన ఈ దంపతులకు ఫిబ్రవరి తొలివారంలో వివాహమైందని, తర్వాత హనీమూన్ కోసం ఇటలీలోని గ్రీస్, అక్కడ నుంచి ఫ్రాన్స్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 27న ముంబైకి చేరుకుని అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్లారు. అయితే, మార్చి 7న భర్తకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో బెంగళూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించి, ఐసోలేషన్‌లో ఉంచారు. భర్తకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ఆమె మార్చి 8న ఆగ్రాకు చేరుకుంది. కాగా, ఆమెతో పాటు విమానంలో ప్రయాణించినవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వైరస్ లక్షణాలు అత్యంత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మహిళలో కరోనా వైరస్ అధికంగా ఉండటంతో అలీగఢ్ మెడికల్ కాలేజీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆగ్రాకు ఆదివారం చేరుకున్న ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించామని, కుటుంబం మొత్తాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని అన్నారు. రెండోసారి నిర్ధారణ పరీక్షల కోసం నమూనాలను పుణేలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపామని ఓ సీనియర్ డాక్టర్ తెలిపారు.


By March 14, 2020 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/infected-google-empolyee-wife-fled-bengaluru-by-air-took-delhi-agra-train-tests-ve/articleshow/74623883.cms

No comments