Breaking News

‘కరోనా’పై చెత్త పోస్ట్... బెంగళూరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి అరెస్ట్


దేశ ప్రజలు అసలే కరోనా అంటేనే భయపడి చస్తుంటే కొందరు చదువుకున్న మూర్ఖులు మాత్రం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉన్నత చదువులు చదవడం, మంచి ఉద్యోగాలు చేస్తుండటంతో తాము గ్రేట్.. అన్న భావనతో రెచ్చిపోతున్నారు. సోషల్‌మీడియాలో చెత్త పోస్టులతో ప్రజల్లో మరింత భయాందోళనను రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న కర్ణాటకలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. బెంగళూరులోని సంస్థలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడు. "ప్రజలారా బయట స్వేచ్ఛగా తిరగండి... తుమ్మండి... కరోనా వైరస్‌ని వ్యాపింపజేయండి" అంటూ అతను పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని వివరాల ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. దీంతో చాలామంది నెటిజన్లు ఇన్ఫోసిస్ సంస్థపైనా తీవ్ర విమర్శలు చేశారు. Also Read: దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజమాన్యం.. ఇలాంటి పోస్టులు చేయడం కోడ్ ఆఫ్ కండక్ట్‌కి వ్యతిరేకమని ప్రకటించి అంతర్గత దర్యాప్తు జరిపించింది. తమ ఉద్యోగి పొరపాటుగా ఈ పోస్టు చేయలేదని, ఉద్దేశపూర్వకంగా చేశాడని తేల్చింది. ఇలాంటి చర్యలు తాను సహించబోమని ప్రకటిస్తూ.. అతడిని సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం బెంగళూరులోని ఇన్ఫోసిస్ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో సంస్థ ఉద్యోగులందరినీ ఇంటికి పంపేసింది. Also Read:


By March 28, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-infosys-employee-arrested-over-spread-the-virus-post-company-terminats-him/articleshow/74856521.cms

No comments