Breaking News

ప్రియుడితో వివాహిత రాసలీలలు.. అలా ఉండగా చూశాడని బంధువును చంపి


భర్త కళ్లుగప్పి మరో వ్యక్తితో కొనసాగిస్తున్న ఓ మహిళ తన బండారం బయటపడుతుందన్న అనుమానంతో బంధువును కిరాతకంగా చంపేసిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. మదురై తిరుమాల్‌ తాలుకా చైన్నైమేట్టు తూర్పు వీధికి చెందిన సుబ్బయ్యకు లక్ష్మి(32)తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఇటీవల ఆమె శివగంగై జిల్లా ఇడయ మేలూరుకు చెందిన పాండితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికే రప్పించుకుని రాసలీలు కొనసాగిస్తుండేది. ఈ నెల 10వ తేదీన పాండిని ఇంటికి రప్పించుకున్న లక్ష్మి అతడితో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగిస్తోంది. Also Read: అదే సమయంలో ఆమె బంధువైన పేతురాజ్(40) ఇంటికి వచ్చాడు. తలుపు తీసి ఉన్నా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన బెడ్రూమ్‌లోకి తొంగి చూడగా లక్ష్మి పరాయి వ్యక్తితో అసభ్యకర రీతితో కనిపించింది. పేతురాజ్ తమను చూడటాన్ని గమనించిన లక్ష్మి, పాండి వెంటనే హాల్‌లోకి వచ్చారు. భర్తను మోసం చేస్తూ ఇంతటి నీచానికి పాల్పడతావా అంటూ పేతురాజ్ ఆమెను నిలదీశాడు. తన బాగోతం భర్తకు తెలిసిపోతుందన్న భయంతో లక్ష్మి ప్రియుడి సాయంతో పేతురాజ్ గొంతు నులిమి చంపేసి పరారైంది. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న శివగంగై పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అన్ని రైల్వేస్టేషన్లకు సమాచారంతో పాటు వారి ఫొటోలను పంపారు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట రైల్వే సీఐ వడివుక్కరసి శనివారం రైల్వేస్టేషన్‌లో నిఘా పెట్టారు. ఆ సమయంలో చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో నిందితులిద్దరూ వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో జోలార్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపేసి వారి కోసం గాలించారు. ఓ బోగీలో ఉన్న లక్ష్మి, పాండిలను అరెస్ట్‌ చేసి శివగంగై పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే శివగంగై పోలీసులు జోలార్‌పేట రైల్వేస్టేషన్‌కు చేరుకొని నిందితులను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. Also Read:


By March 16, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-kills-relative-with-help-of-boy-friend-in-tamil-nadu/articleshow/74647061.cms

No comments