Breaking News

స్పెయిన్ రాజ కుటుంబంలో విషాదం.. కరోనా వైరస్‌తో రాణి మృతి


ఐరోపా దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇటలీలో ఇప్పటికే కరోనా మరణాలు 10వేల దాటిపోగా, స్పెయిన్‌లోనూ మృతుల సంఖ్య దాదాపు 6వేలకు చేరింది. బాధితుల సంఖ్య కూడా 73వేలు దాటింది. ఇదిలా ఉండగా, స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ కారణంగా మార్చి 26న మృతిచెందారు. స్పెయిన్ యువ రాణి (86) పారిస్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆమె సోదరుడు సిక్టో హెన్రిక్ డీ బార్బన్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. స్పెయిన్ రాజ కుటుంబానికి చెందిన క్యాడెట్ విభాగం హౌస్ ఆఫ్ బార్బన్ పర్మాలో మారియా థెరిసా సభ్యురాలు. ఇటీవల కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన మారియా హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతూ కన్నుమూసింది. స్పెయిన్ రాజు జేవియర్, మెడెలియన్ డీ బార్బన్ దంపతులకు మారియా థెరిసా 1933లో పారిస్‌లో జన్మించారు. ఫ్రాన్స్‌లోనే విద్యాభ్యాసం పూర్తిచేసిన మారియా... పారిస్‌లోని సోర్‌బొన్నే యూనివర్సిటీ, మాండ్రిడ్‌లోని కంప్లూటనస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. ముక్కుసూటిగా వ్యవహరించే మారియా.. తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టినట్టు చెప్పేవారు. దీంతో ఆమెను విప్లవ రాణి అని పిలిచేవారు. మారియా థెరిసాకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలు ఉన్నారు. ఈమెకు సంతానం మాత్రం లేరు.


By March 29, 2020 at 01:11PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/spain-princess-maria-teresa-first-royal-to-die-from-coronavirus/articleshow/74871949.cms

No comments