Breaking News

మహిళా దినోత్సవ రోజే వరంగల్‌లో గ్యాంగ్ రేప్... 55ఏళ్ల మహిళపై నలుగురి పైశాచికం


అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 55 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కామాంధుల చేతిలో అఘాయిత్యానికి గురైన బాధితురాలు ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. Also Read: బాధితురాలు వరంగల్‌లోని ఓ గోదాములో పనిచేస్తోంది. ఆదివారం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లిన నలుగురు యువకుడు ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు అధికంగా రక్తస్రావం కావడంతో ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గమనించిన స్థానికులు ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: బాధితురాలికి అధికంగా రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడినవారు... ఆమెను ఆటోలో ఆస్పత్రి వద్ద వదిలిన వారు ఒక్కరేనా? వేర్వేరా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By March 09, 2020 at 12:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/55-yrs-old-woman-gang-raped-by-4-men-in-warangal/articleshow/74547771.cms

No comments