Breaking News

బీజేపీలో చేరిన 22 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు


మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ముందు నుంచే అనుకున్నదే జరిగింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న కమల్ నాథ్ సర్కార్ బలపరీక్షకు ముందే కుప్పకూలింది. ఫ్లోర్ టెస్ట్‌కు ఒక్క రోజు ముందే కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలో కమల తీర్థం పుచ్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఎమ్మెల్యేలంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సకు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయింది. కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో ఆయన వెంటే నడిచిన చెందిన 22 మంది మాజీ ఎమ్మెల్యేలు నడ్డాను కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయవర్గీయ తెలిపారు. రాజీనామాల పర్యవసానంగా జరగబోయే ఉప ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వీరికే బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు మారిన రాజకీయాలతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ త్వరలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ స్థానాలకు కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉప ఎన్నికల తేదీలను ప్రకటించనున్నది.


By March 22, 2020 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/22-rebel-madhya-pradesh-congress-mlas-join-bjp/articleshow/74756264.cms

No comments