Breaking News

తెలంగాణలో ‘కల్లు’ కల్లోలం.. ఒక్కరోజే 12 మంది మృతి


తెలంగాణలో కల్లు దొరక్క అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కల్తీ కల్లుకు బానిసలైన చాలామంది లాక్‌డౌన్ కారణంగా అది దొరక్కపోవడంతో పిచ్చెక్కిపోతున్నారు. కొందరైతే మతితప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఒక్క ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే 8 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 12 మంది కల్లు దొరక్క మరణించడం పరిస్థితి తీవ్రత తెలియజేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఆరుగురు, వికారాబాద్‌, నిజామాబాద్‌, మెదక్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. Also Read: హైదరాబాద్‌లోని ఉప్పల్‌ గణేష్‌నగర్‌లో ఉండే వెంకటేశ్వర్లు (62) దినసరి కూలీ. మద్యం దుకాణాలు మూసేసినప్పట్నుంచి భార్య, పిల్లలతో గొడవ పడుతున్నాడు. ఆదివారం రాత్రి భార్య, పిల్లలను బయటకు నెట్టేసి ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్లకు చెందిన చింతకింది లక్ష్మయ్య (34) కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. సోమవారం గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పురపాలిక పరిధి గండిమైసమ్మ చౌరస్తాలోని కల్లు కాంపౌండ్‌ వెనుక సోమవారం గుర్తుతెలియని 30-35 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని దుండిగల్‌ పోలీసులు గుర్తించారు. కల్లు పాక వెనుక తాగిపడేసిన సీసాల్లో మిగిలిపోయిన కల్లు తాగి మృతిచెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read: దుండిగల్‌ గండి మైసమ్మ చౌరస్తాలో సోమవారం పోలీసులు ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జగద్గిరిగుట్ట దేవమ్మ బస్తీలో నివాసం ఉండే ప్రకాశ్‌ (60) కల్లు దొరక్క నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆదివారం హెచ్‌ఎంటీ మైదానం సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. రాజేంద్రనగర్‌ ఠాణా పరిధి కిస్మత్‌పూర్‌కు చెందిన దాసరి వెంకటయ్య (60) నాలుగు రోజులుగా కల్లు కోసం వెంపర్లాడుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికి ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం బాత్రూమ్‌లో శవమై కనిపించాడు. Also Read: సోమవారం పటాన్‌చెరు పట్టణం జేపీ కాలనీలో భిక్షపతి కల్లు దొరక్క ఫిట్స్‌ బారిన పడి మరణించాడు. దీంతో ఒక్క పటాన్‌చెరు ప్రాంతంలోనే ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లికి చెందిన దేవదాసు(45) కల్లు దొరక్క రెండు మూడు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రులతో పాటు ప్రధాన పట్టణాల్లో ఉన్న ప్రాంతీయ ఆస్పత్రులకు కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రామాయంపేట, పటాన్‌చెరు ఆస్పత్రులకు తాకిడి ఎక్కువైంది. Also Read:


By March 31, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/12-persons-end-lives-for-liquor-in-telangana/articleshow/74906704.cms

No comments