విశాఖలో నయవంచకుడు... యువతిని రేప్ చేసి, బెదిరించి రూ.10 లక్షలు వసూలు

విశాఖపట్నంలో ఓ నయవంచకుడి దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు ఆ విషయాన్ని బయటపెడతానని బెదిరించి బాధితురాలి నుంచి వివిధ దఫాలుగా సుమారు రూ.10లక్షల వరకు వసూలు చేశాడు. అయినప్పటికీ ఆ కామాంధుడి వేధింపులు ఆపకపోవడంతో యువతి విశాఖ పోలీసులను ఆశ్రయించింది. జిల్లాకు చెందిన ఓ యువకుడు బీటెక్ చదివి ఉద్యోగం కోసం కొన్నాళ్ల క్రితం వైజాగ్‌కు వచ్చాడు. అక్కడ తన జిల్లాకే చెందిన డిగ్రీ విద్యార్థినితో అతడికి పరిచయమైంది. Also Read: ఇద్దరూ కొద్దిరోజులు సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలోనే అతడు అసభ్యంగా ప్రవర్తించడంతో యువతి దూరం పెట్టింది. దీంతో కక్షగట్టిన అతడు ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయింది. అలా అప్పుడప్పుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఈ విషయం బయటపెట్టి పరువు తీస్తానంటూ బెదిరించి పలు దఫాలుగా రూ.10లక్షల వరకు కాజేశాడు. అయినప్పటికీ అతడు వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు బుధవారం విశాఖ పోలీసులను ఆశ్రయించింది. Also Read: అతడితో పరిచయం అయినప్పటి నుంచి రూ.10లక్షల సొమ్ము కాజేసిన వరకు మొత్తం తతంగాన్ని యువతి వివరించడంతో పోలీసులు షాకయ్యారు. దీంతో వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడు కొద్దిరోజుల క్రితమే సొంతూరికి మకాం మార్చేసినట్లు తేలడంతో కేసును శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు ఉంటాయని రేంజ్ డీఐజీ రంగారావు చెబుతున్నారు. ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తించినా, లైంగింకంగా వేధించినా మహిళలు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. Also Read:
By March 19, 2020 at 09:03AM
No comments