Pawan Kalyan: ఈ వయసులోనూ ఎంత అందమో అంటున్న మాధవీ లత
మెగా ఫ్యామిలీలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అంత అందగాడు లేరు. అంటే మెగాస్టార్ చిరంజీవి కూడా అందగాడే అనుకోండి. కానీ ఇప్పటికీ పవన్‌లో మాత్రం ఆ ఛార్మ పోలేదనే చెప్పాలి. అందుకే ఆయనపై మనసు పారేసుకున్నట్లున్నారు సినీ నటి, బీజేపీ నేత . నిన్న రాత్రి నిద్రపోయే ముందు మాధవి పవన్ గురించి సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టారు. ‘‘ఈ వయసులో కూడా ఎంత అందంగా ఉన్నాడో. ఏమైనా సరే అబ్బా పవన్ కళ్యాణ్ అందగాడు. గుడ్ నైట్’ అని కామెంట్ చేస్తూ పవన్ ఫొటో పోస్ట్ చేసారు. మాధవీ కామెంట్ పెట్టగానే ఆమెను పొగడ్తలతో ముంచెత్తడానికి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. READ ALSO: ‘‘పవర్‌స్టార్ మేడమ్ అక్కడా.. మీ లాంటి అమ్మాయిల ఆశీస్సులు ఆయనకు ఉండా అయన ఎప్పుడు అందగాడే’’ అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అయితే మాధవిలతకు పవన్‌పై ఇంత ప్రేమ పుట్టుకురావడానికి కారణం రాజకీయాలే. జనసేన పార్టీ, బీజేపీతో పొత్తు పెట్టుకోబోతోందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి లాభమని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నామని చెప్పారు. జనసేన, బీజేపీ భావజాలం ఒకటిగానే ఉందని.. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. READ ALSO:
By February 15, 2020 at 10:38AM
No comments