ORR Accident: లారీని ఢీకొట్టిన డీసీఎం.. నుజ్జునుజ్జయిన క్యాబిన్, డ్రైవర్ మృతి
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన డీసీఎం.. సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. వేగంగా ఢీకొట్టడంతో డీసీఎం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దీంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలాడు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళ్లు, పరికరాల సాయంతో డ్రైవర్ శవాన్ని క్యాబిన్‌లో నుంచి అతి కష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో మరణించిన డీసీఎం డ్రైవర్‌ను రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన పల్లెటి గణేష్ (19)గా గుర్తించారు. ఓఆర్ఆర్ టీమ్స్ సాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
By February 09, 2020 at 12:06PM
No comments