Breaking News

Namratha Shirodkar: మహేష్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు, నాలుగేళ్లు దూరంగా ఉన్నాం


టాలీవుడ్‌కి చెందిన ఎవర్‌గ్రీన్ జంటల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఒకరు. 2000లో వచ్చిన ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వారితో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మహేష్ తండ్రి కృష్ణ, నమ్రత తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని నమ్రత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను మహేష్ ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించుకున్నాం. ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ మొదట్లో ఇటు నా ఇంట్లోవారు, అటు మహేష్ ఇంట్లోవారు ఒప్పుకోలేదు. దాంతో నాలుగేళ్ల పాటు ఇంట్లోవారిని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాం. చెప్పాలంటే ఆ నాలుగేళ్లు నేను, మహేష్ కలుసుకోలేదు కూడా. అప్పుడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. మొత్తానికి పెద్దవారు దిగొచ్చి మా పెళ్లికి ఒప్పుకున్నారు. అలా నాకు, మహేష్‌కు 2005లో పెళ్లైంది. మహేష్‌కి ఎంత సిగ్గంటే హీరోయిన్స్‌తో సరిగ్గా మాట్లాడరు’’ అని తెలిపారు. READ ALSO: మహేష్, నమ్రత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇటీవల నమ్రత, మహేష్ తమ 15వ పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. 1994లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత.. తెలుగులో ‘అంజి’, ‘వంశీ’ సినిమాల్లో నటించారు. హిందీలో ఆమె హీరోయిన్‌గా యాక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. పెళ్లయ్యాక నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడని చాలా సార్లు మీడియా అడిగింది కానీ తనకు సినిమల కంటే కుటుంబమే ముఖ్యం అని చెప్పేవారు. READ ALSO:


By February 15, 2020 at 02:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/namratha-shirodkar-shares-interesting-details-about-her-love-story-with-mahesh-babu/articleshow/74147805.cms

No comments