Breaking News

Coronavirus చైనాలో పర్యటించిన విదేశీయులకు భారత్‌లోకి నో ఎంట్రీ


ముప్పును సమర్ధంగా ఎదుర్కోడానికి భారత్ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జనవరి 15కు ముందు ఆ తర్వాత చైనాలో పర్యటించిన విదేశీయులను దేశంలోని రాకుండా నిషేధించాలని నిర్ణయించింది. విమాన, జల, రోడ్డు ఏ మార్గంలో వచ్చినవారినీ అనుమతించబోమని తెలిపింది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాయన్మార్ దేశాలు కూడా ఇందులోకి వస్తాయని పేర్కొంది. ఫిబ్రవరి 5కి ముందు చైనా పాస్‌పోర్ట్ హోల్డర్‌కు జారీ చేసిన రెగ్యులర్, ఇ-వీసా రెండింటినీ తక్షణమే రద్దుచేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శనివారం సర్క్యులర్ జారీచేసింది. విదేశాల్లో నివసించే చైనీయులు, చైనాలో ఉండే విదేశీయుల రెగ్యులర్ వీసా, ఈ-వీసాలను రద్దుచేస్తున్నట్టు పేర్కొంది. జాతీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతున్న భారతీయ, విదేశీ విమానయాన సంస్థలకు ఇవి వర్తిస్తాయని అన్నారు. తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5కి ముందు రెగ్యులర్ వీసా, ఈ-వీసాల జారీచేయబడిన చైనీయులు గానీ, ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న విదేశీయులకు భారత్‌లో రావడానికి అనుమతిలేదు. ఒకవేళ అత్యవసరంగా భారత్‌లో ప్రయాణించాలంటే బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని లేదా కొత్త వీసా కోసం షాంఘై, గ్వాంగ్జూ కాన్సులేట్‌లోనూ సంప్రదించవచ్చని తెలిపింది. అయితే, ఈ నిబంధనలు మాత్రం విమాన సిబ్బందికి వర్తించవు. వారు చైనీయులైనా, ఆ దేశం నుంచి వచ్చిన విదేశీయులైనా సంబంధం లేదని పేర్కొంది. మరోవైపు, చైనాలో కరోనా వైరస్‌ రోజురోజుకీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. అనేక మందిని పొట్టనబెట్టుకుంటోన్నీ ఈ మహమ్మారిని నిరోధించచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా అదుపులోకి రావడం లేదు. ఓవైపు మరణాల సంఖ్య, మరోవైపు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 89 మంది కరోనా వైరస్‌తో మృతిచెందగా, వీరిలో 81 మంది హుబె ప్రావిన్సులకు చెందినవారే. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 811కు చేరింది.


By February 09, 2020 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-has-decided-to-bar-entry-of-foreigners-who-have-been-to-china-after-jan-15th/articleshow/74039707.cms

No comments