అద్దె ఇంట్లో వ్యభిచారం.. నకిలీ విటుడితో కిలేడీ గుట్టురట్టు

తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఇంట్లో గుట్టుగా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొట్టపాలయం ప్రాంతానికి చెందిన వి.శాంత(40) అనే మహిళ రాజా కాలనీలోని ఓ ఇంట్లో కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆర్థిక అవసరాలు ఉన్న 36ఏళ్ల మహిళను మభ్యపెట్టి ఆమె వద్దకు విటులను పంపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శాంత వ్యవహారాలపై నిఘా పెట్టారు. Also Read: ఓ పోలీసును విటుడిగా ఆ ఇంటికి పంపించి వ్యభిచారం జరుగుతున్న నిర్ధారించుకున్న స్పెషల్ టీమ్ రైడ్ చేసింది. నిర్వాహకురాలు శాంతతో పాటు సెక్స్ వర్కర్‌ని అదుపులోకి తీసుకున్నారు. శాంత నాలుగు నెలల క్రితం ఆ ఇంటికి అద్దెకు తీసుకుని వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పక్క పోర్షన్‌లోనే ఇంటి యజయాని నివసిస్తున్నా ఈ బాగోతాన్ని గమనించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ సెక్స్ దందాకు అతడి మద్దతు కూడా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: శాంతపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. నగరంలో అనేకచోట్ల వ్యభిచార నిర్వాహకులు ఇళ్లను అద్దెకు తీసుకుని గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇంటిని అద్దెకిచ్చిన యజమానులు అద్దెదారుల తీరును పరిశీలిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. Also Read:
By February 21, 2020 at 12:15PM
No comments