కోడికూర కోసం ఘర్షణ.. రణరంగంగా మారిన పెళ్లి వేడుక
వేద మంత్రాలు, అతిథుల సందడితో కళకళ్లాడాల్సిన కల్యాణ మండపం రణరంగంగా మారిన ఘటన జిల్లా సారవకోట మండల కేంద్రంలో కలకలం రేపింది. స్థానిక రెల్లివీధిలో బుధవారం జరిగిన వివాహ వేడుకలో భోజనాల దగ్గర తలెత్తిన వివాదంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో పలువురు గాయపడ్డారు. Also Read: రెల్లివీధికి చెందిన కూన సురేష్ అనే యువకుడికి బూర్జ మండలం ఉప్పినివలస గ్రామానికి చెందిన సవలాపురం నందినితో బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భోజనాల దగ్గర కోడికూర విషయంలో వరుడు, వధువు బంధువుల మధ్య వివాదం తలెత్తింది. వరుడికి బంధువైన ప్రకాశ్ అనే వ్యక్తి చికెన్ వడ్డిస్తుండగా భోజనం ప్లేటు వధువు బంధువు ఒకరికి తలపై తగిలింది దీంతో చెలరేగిన వివాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. Also Read: ఒకరికొకరు కర్రలతో కొట్టుకుంటూ, కుర్చీలు విసురుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. కాసేపటి తర్వాత ఇరువర్గాల వారు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపైకి వచ్చి మళ్లీ ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా వరుడి వర్గానికి చెందిన కలింగపట్నం గణేష్ మెడలోని బంగారు గొలుసు వధువు బంధువులు లాక్కున్నట్లు ఆరోపించారు. Also Read: ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు వధువు వర్గానికి చెందిన నలుగురు, వరుడి వర్గానికి చెందిన ఐదుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని పాతపట్నం ప్రభుత్వాసుత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి వివాహం జరిపించారు. Also Read:
By February 13, 2020 at 10:43AM
No comments