Breaking News

నడిరోడ్డుపై భర్తను కొట్టి.. భార్య కిడ్నాప్.. నెల్లూరులో దారుణం


తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందన్న కోపంతో కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. కళాశాల వద్ద మాటువేసి కూతురుని కిడ్నాప్ చేశారు. అడ్డుపడిన అల్లుడిని చితక్కొట్టారు. కూతురుని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా బంధువుల ఇంట్లో బంధీని చేశారు. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. కలువాయి మండలానికి చెందిన యువతి.. ఏఎస్ పేట మండలానికి చెందిన ఎం.వెంకటరమణయ్యలు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ప్రేమ పెళ్లి వద్దని వారించినా యువతి వినకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. Also Read: తమ మాట వినకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న కూతురిపై కుటుంబ సభ్యులు కోపం పెంచుకున్నారు. తల్లిదండ్రులు ముసలయ్య, రత్నమ్మ, మేనమామ వెంకటస్వామి ఓ ఆటోడ్రైవర్‌తో కలిసి కూతురుని కిడ్నాప్ చేసేందుకు నెల్లూరులో ఆమె చదువుతున్న కాలేజీ వద్ద మాటు వేశారు. ప్రాక్టికల్స్ పరీక్షలు రాసి బయటకు వచ్చిన కూతరు అల్లుడితో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లింది. Read Also: వారిద్దరినీ అనుసరించిన కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై అల్లుడిని కొట్టి కూతురుని కిడ్నాప్ చేశారు. రాపూరు మండలంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. యువతిని విడిపించి కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. యువతి తండ్రి ముసలయ్య, మేనమామ వెంకటస్వామి పరారీలో ఉన్నారు.


By February 01, 2020 at 11:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-lady-abducted-by-her-parents-in-nellore-district/articleshow/73830410.cms

No comments