ఫ్రెండ్‌తో కలిసి సొంత చెల్లిపైనే అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. తోడబుట్టిన చెల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సోదరుడే ఫ్రెండ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అండగా ఉంటాడనుకున్న అన్నే తనపై దారుణానికి పాల్పడటంతో బెదిరిపోయిన బాధితురాలు చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. Also Read: పాల్వంచ మండలంలోని జ్యోతినగర్‌కు చెందిన రాంబాబుకు చెల్లెలు ఉంది. ఆమెకు రక్షణగా ఉండాల్సిన అతడు ఆమెపైనే కన్నేశాడు. గురువారం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. రక్తం పంచుకుపుట్టిన అన్నే తనపై అఘాయిత్యానికి పాల్పడటాన్ని తట్టుకోలేకపోయిన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి సమయంలో ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి స్థానికులను ఆరా తీశారు. Also Read: మధ్యాహ్న సమయంలో రాంబాబు తన స్నేహితుడితో కలిసి ఇంటి వచ్చాడని చెప్పడంతో వారు కుమారుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా చెల్లెలిపై తానే అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు గురువారం రాత్రి పెద్దయెత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. సొంత చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడిన రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Also Read:
By February 14, 2020 at 11:49AM
No comments