అమ్మాయిని ఎరగా వేసి... గదికి రప్పించి.. పక్కా స్కెచ్‌తోనే చేపల వ్యాపారి హత్య
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన చేపల వ్యాపారి రమేశ్ ఉదంతంలో పోలీసులు తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడైన రాజునాయక్ అలియాస్ రిజ్వాన్ అలియాస్ శ్రీనివాస్ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌కి డైరెక్టర్‌గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి పలువురు యువతులతో సంబంధాలున్నాయని, వారిని అడ్డం పెట్టుకుని కొందరిని హనీట్రాప్‌లో ఇరికించి డబ్బులు గుంజినట్లు గుర్తించారు. Also Read: రమేశ్‌నే ఎందుకు టార్గెట్ చేశాడంటే.. శ్రీనివాస్ గతంలో వికాస్‌పురి కాలనీలో చేపల వ్యాపారి పి.రమేష్ ఇంట్లో ఐదేళ్లు అద్దెకున్నాడు. అనంతరం మల్కాజిగిరికి మకాం మార్చాడు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతడు ఆర్థికంగా చితికిపోయాడు. రమేష్ గురించి పూర్తి సమాచారం తెలియడంతో అతడి నుంచి డబ్బులు గుంజేందుకు ప్లాన్ వేశాడు. నెల క్రితం ఓ మహిళ, ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్‌నగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గత నెల 26న రమేష్‌కు యువతిని ఎరగా చూపి డబ్బులు లాగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో అనురాధ అనే మహిళతో ఈ నెల 1న రమేష్‌కు ఫోన్ చేసి మళ్లీ జవహర్‌నగర్‌లోని గదికి పిలిపించాడు. రమేష్‌కు నిద్రమాత్రలు కలిపిన మద్యం తాగించి ఒంటిపై ఉన్న ఐదు తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అనంతరం రమేశ్ తలపై సుత్తితో బలంగా కొట్టి చంపేశాడు. Also Read: రమేష్‌ను చంపేసిన అనంతరం శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి ఆభరణాలను తీసుకుని మల్కాజిగిరికి వెళ్లిపోయాడు. రెండో తేదీన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో నగలు కుదువ పెట్టి ఆ డబ్బులతో అప్పటికే తాకట్టులో ఉన్న తన భార్య ఆభరణాలు విడిపించాడు. ఆ తర్వాత రమేశ్ సెల్‌ఫోన్ నుంచే కుటుంబసభ్యులకు మెసేజ్ చేసి ఆయన్ని కిడ్నాప్ చేశానని, వదిలిపెట్టాలంటే రూ.90లక్షల ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో రమేష్ కొడుకు తన తండ్రి కనిపించడం లేదని ఎస్సార్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల ప్లాన్ ప్రకారం రూ.20 లక్షలు ఇస్తామని డబ్బుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపించగా.. బుధవారం బోరబండ చౌరస్తా వద్ద తీసుకుంటానని అతడు చెప్పాడు. Also Read: రమేష్ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్న శ్రీనివాస్ మహిళతో కలిసి రెండో తేదీ రాత్రి ప్లాస్టిక్ కవర్‌లో కుక్కేందుకు ప్రయత్నించాడు. వీలు కాకపోవడంతో కాళ్లు, చేతులు కోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఇద్దరూ మల్కాజ్‌గిరి వెళ్లిపోయారు. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు నాఫ్తలిన్ బాల్స్, రూమ్ ఫ్రెషనర్ జల్లి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. మరుసటిరోజు దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రమేశ్ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సీసీ కెమెరాలు, వాట్సాప్ సందేశాల ఆధారంగా పోలీసులు శ్రీనివాస్‌తో అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. Also Read:
By February 06, 2020 at 09:00AM
No comments