తెలంగాణ యువతకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. వరంగల్‌లో మైండ్‌ట్రీ
జేబీఎస్-ఎంజీబీఎస్ స్టేషన్ల మధ్య హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమైన వేళ.. తెలంగాణ ప్రజలకు మంత్రి మరో గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్‌లో కేంద్రాన్ని ప్రారంభించడానికి ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించిందని తెలిపారు. ‘జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో లైన్ ప్రారంభం తర్వాత మరో శుభవార్త చెబుతున్నా. వరంగల్ నగరంలో మైండ్ ట్రీ కేంద్రాన్ని ప్రారంభించాలన్న సీఎం కేసీఆర్ సలహాకు ఎల్ అండ్ టీ సీఈవో అండ్ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు అంగీకరించారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐటీ సంస్థలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నగరానికే పరిమితం అయ్యాయి. కాగా తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం నగరాలకూ ఐటీ సేవలను విస్తరించాలని సర్కారు భావిస్తోంది. హైదరాబాద్‌లో తూర్పున ఉన్న ఉప్పల్ ప్రాంతంలో ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్-వరంగల్ నగరాలు ముంబై-పుణే తరహాలో డెవలప్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
By February 08, 2020 at 11:28AM
No comments