Breaking News

క్షణికావేశంలో చెల్లి, పినతల్లి దారుణహత్య.. సూర్యాపేటలో దారుణం


జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు క్షణికావేశంలో పినతల్లి, చెల్లిని అత్యంత దారుణంగా చంపేశాడు. జిల్లాలోని తాళ్ల కంపాడు మండలంలో హరీష్‌ అనే యువకుడు పినతల్లి అంజమ్మ అంజమ్మ, చెల్లెలు మౌనికతో గురువారం ఉదయం గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆవేశానికి గురైన వారిద్దరిని రోకలి బండతో తలపై కొట్టి దారుణంగా చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. Also Read: నిందితుడు హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంజమ్మ, మౌనిక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ జంట హత్యలకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By February 06, 2020 at 09:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-murder-his-step-mother-and-sister-in-suryapet/articleshow/73975234.cms

No comments