మైనర్ బాలికలతో వెట్టిచాకిరీ, బాడీ మసాజ్.... తెలుగు యాంకర్‌పై కేసు

ఇద్దరు మైనర్ బాలికలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న తెలుగు టీవీ యాంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఆ తర్వాత తిరిగి పంపకుండా ఓ టీవీ యాంకర్ ఇంట్లో వారిద్దరిని పనికి కుదిర్చింది. పండగ సెలవులు ముగిసినా బాలికలు తిరిగి రాకపోవడం, తల్లికి ఫోన్ చేస్తే స్పందించకపోవంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారున Also Read: దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు చైల్డ్ కేర్ కమిటీతో కలిసి హైదరాబాద్ వెళ్లి వారి తల్లిని విచారించగా ఓ యాంకర్ ఇంట్లో పనికి కుదిర్చినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఆ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకునేవారని, బాడీ మసాజ్ లాంటి పనులు కూడా తమతో చేయించుకున్నారని తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యాంకర్‌పై కేసు నమోదు చేశారు. Also Read: మైనర్లను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరీత్యా నేరమని యాంకర్‌కు చెప్పిన పోలీసులు వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లల్ని తన ఇంట్లో పనికి పెట్టుకున్న యాంకర్ విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. Also Read:
By February 29, 2020 at 09:08AM
No comments