Breaking News

నల్లమల అడవుల్లో నరబలి.. మహిళను వివస్త్రను చేసి గొంతు కోసి కిరాతకంగా..


ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల మధ్యే బతుకీడుస్తున్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలతాయని నమ్మేవారు... తమకు తెలిసిందే ప్రపంచం అనుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. నరబలి ఇస్తే క్షుద్రశక్తులు వశం అవుతాయని నమ్ముతున్న కొందరు అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా తెలంగాణలోని జిల్లాలో గల నల్లమల్ల అడవుల్లో ఓ మహిళను మంత్రగాళ్ల నరబలి ఇచ్చారు. Also Read: నల్లమల అభయారణంలో ఉన్న అమ్రాబాద్‌ మండలం ఈగలపెంటకు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతట్టు అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను వివస్త్రను చేసి, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ద్వారా గుర్తించారు. అక్కడ లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలిని మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన శాంతిరవి ముదిలియార్‌గా గుర్తించారు. దీంతో అచ్చంపేట పోలీసులు థానె పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: ఆమెను 10 రోజుల కిందటే హత్య చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూలు, కొన్ని బొమ్మలు లభించడంతో క్షుద్రపూజలు చేసే వ్యక్తులు ఆమెను నరబలి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే థానె నుంచి ఆమె ఇక్కడికి ఎలా వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By February 03, 2020 at 11:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/maharastra-woman-brutally-killed-in-nallamala-forest-case-booked/articleshow/73892684.cms

No comments