Breaking News

ప్రియుడిపై పోరాడి పెళ్లి చేసుకుని.. వేధింపులతో ఆర్నెల్లకే ఆత్మహత్య


ప్రేమించి మోసం చేసి వ్యక్తిపై పోరాడి పెళ్లి చేసుకున్న మహిళ అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. నిర్మల్‌ జిల్లాకు చెందిన కె.సునీత(22)కు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల ఇంట్లో పెరిగిన ఆమె కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లింది. అక్కడ బుట్టాపూర్‌కు చెందిన దుర్గం మహేశ్‌ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. దీన్ని అలుసుగా తీసుకున్న మహేశ్‌ ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. Also Read: ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చేసి ఆమె నుంచి తప్పించుకోసాగాడు. పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడుగుతున్నా ప్రియుడు పట్టించుకోకపోవడంతో ఆర్నెళ్ల క్రితం ఆమె ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. గ్రామపెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని మహేశ్‌తో ఆమెకు వివాహం జరిపించారు. కొద్దిరోజులకు దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మహేశ్‌తో పాటు అతడి తల్లి, బంధువులు సునీతకు తీవ్రంగా వేధించేవారు. తన బాధను చెప్పుకోవడానికి తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. Also Read: శనివారం భర్త తాగొచ్చి దూషించడంతో పాటు కొట్టడంతో సునీత మనస్తాపానికి గురై పురుగుల మందు తాగేసింది. కుటుంబసభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే సునీత ఆత్మహత్య చేసుకుందని స్థానిక ప్రజాసంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 24, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-commits-suicide-over-husband-harassment-in-nirmal-district/articleshow/74277574.cms

No comments