Breaking News

అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసి చెల్లెలితో పెళ్లి... షాకిచ్చిన ప్రియురాలు


పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్‌లో యువకుడి తల్లి పేరును కూడా చేర్చారు. Also Read: కోల్‌కతాకు చెందిన ఓ యువతికి 2015లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అనేక ప్రాంతాలు తీసుకెళ్తూ ఐదేళ్ల పాటు యువతిని లైంగికంగా దోచుకున్నాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువకుడి తల్లి సైతం ఆమెపై దాడికి పాల్పడి.. తన కొడుకు జోలికి రావొద్దని హెచ్చరించింది. Also Read: కొద్దిరోజులుగా యువతితో అన్ని సంబంధాలు తెంచకున్న యువకుడు గత ఆదివారం ఆమె చెల్లిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడు, ఆమె తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు కుటుంబాల నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. Also Read:


By February 23, 2020 at 01:14PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-raped-by-man-for-5-years-pretext-of-marriage-later-married-her-younger-sister/articleshow/74264896.cms

No comments