కేపీహెచ్‌బీలో వ్యభిచారం గుట్టురట్టు.. ముగ్గురు అమ్మాయిలతో దొరికిన ఆరుగురు విటులు

హైదరాబాద్‌లో మరో చీకటి బాగోతం బట్టబయలైంది. స్పా, సెలూన్ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న ఫ్లాట్‌పై కేపీహెబ్‌బీ పోలీసులు శనివారం రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేసి పలువురు యువతులకు విముక్తి కల్పించారు. Also Read: కూకట్‌పల్లికి చెందిన వెంపటి సతీష్ అనే వ్యక్తి ఆరో ఫేజ్‌లో గ్లోవెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కస్టమర్లకు మసాజ్ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారిని ప్రలోభాలకు గురిచేసి వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం రాత్రి ఒక్కసారిగా స్పా సెంటర్లో తనిఖీలు చేశారు. Also Read: ఈ సందర్భంగా నిర్వాహకులు సతీశ్, ఓ ఉద్యోగినితో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు. ముగ్గురు సెక్స్ వర్కర్లకు విముక్తి కల్పించి పునరావాస కేంద్రానికి తరలించారు. సంఘటనా స్థలంలో రూ. 1,13,450 నగదు, ఓ ల్యాప్‌టాప్, తొమ్మిది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. Also Read:
By February 03, 2020 at 09:34AM
No comments