వెంబడించి.. కత్తులతో నరికి.. హైదరాబాద్ యువకుడి దారుణహత్య

పాతబస్తీలో దారుణహత్య కలకలం రేపింది. కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇమ్రాన్ అనే వ్యక్తి దుండుగులు కత్తులతో నరికి కిరాతకంగా చంపేశారు. మోయిన్‌పురాకు చెందిన సయ్యద్ ఇమ్రాన్(32)కు ఇదే బస్తీకి చెందిన కొందరితో పాతకక్షలున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇమ్రాన్‌ను అతని స్నేహితులు ఫోన్ చేసి బయటకు రప్పించారు. అక్కడే కాపు కాసిన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై కత్తులతో దాడి చేశారు. Also Read: వారి నుంచి తప్పింనుకునే క్రమంలో ఇమ్రాన్ కొంతదూరం పరుగుపెట్టాడు. అయితే వదలని దుండగులు అతడిని కత్తులతో నరికారు. కడుపులో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న బాధితుడు సోదరుడు సయ్యద్ అక్కడికి చేరుకునే సరికే దుండగులు పరారయ్యారు. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇమ్రాన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:
By February 03, 2020 at 09:11AM
No comments