నిర్భయ కేసు: దోషుల ఉరి వ్యవహారంలో మరో చిక్కు

దోషుల్లో మరో వ్యక్తి అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరాడు. ఈ మేరకు శనివారం పిటిషన్ దాఖలు చేశాడు. వినయ్ కుమార్ శర్మ గత బుధవారం దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను శనివారం రాష్ట్రపతి తిరస్కరించిన సంగతి తెలిసిందే. వెంటనే మరో దోషి అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: నిర్భయ కేసులో నిందితులైన ముకేశ్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ కుమార్ శర్మ (26), అక్షయ్ ఠాకూర్ (31)ను నిజానికి ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 1) 6 గంటలకు ఉరి తీయాలని తొలుత సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ, వినయ్ శర్మ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో వారి ఉరి అమలుపై నిలుపుదల విధించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నిర్భయ దోషులను ఉరి తీయొద్దని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Also Read: తాజాగా వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణతో దోషుల ఉరికి మార్గం సుగమం అయినట్లయింది. కానీ, శనివారం మళ్లీ మరో దోషి అక్షయ్ కుమార్ క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయడంతో వీరి ఉరి వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. మళ్లీ ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన అనంతరం కోర్టు మరణ శిక్షపై ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన 14 రోజుల వరకు ఉరి తీయడం సాధ్యపడదు. Also Read:
By February 01, 2020 at 12:31PM
No comments