Breaking News

ఇద్దరు బిడ్డలను చంపి ఉరేసుకున్న తల్లి.. నెల్లూరులో విషాద ఘటన


వారిది సామాన్య కుటుంబం. దంపతులు, వారికి ఇద్దరు కుమారులు. సంసారం హాయిగా సాగిపోతోంది. అయితే తన బిడ్డలను మంచి స్కూల్‌లో చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆ తల్లి ఆశపడింది. గ్రామంలో ఉండే వారి చదువులు సజావుగా సాగవని ఆవేదన చెందింది. పట్టణంలో కాపురం పెడదామని భర్తను కోరగా అతడు నిరాకరించాడు. ఎన్నిసార్లు చెప్పినా భర్త తన మాట వినడం లేదన్న కోపంతో ఇద్దరు బిడ్డల ప్రాణం తీసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన జిల్లాలో జరిగింది. Also Read: ఊనుగుంటపాళెం గ్రామానికి చెందిన పాలూరు రాణి(23) అనే మహిళకు కొడవలూరు మండలం గుండాలమ్మపాళెంకు చెందిన నాగార్జునతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సందీప్‌(5), సుధీర్‌(2). నెల్లూరులో కాపురం పెట్టి పిల్లల్ని చదివించుకుందామని రాణి కొంతకాలంగా భర్తతో గొడవపడుతోంది. అతడు ససేమిరా అనడంతో ఇటీవల అలిగి పిల్లలిద్దరినీ తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. Also Read: ఏం జరిగిందో తెలీదు గానీ రాణి శుక్రవారం రాత్రి పిల్లల ముఖాలపై దిండును అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ విషయాన్ని కుటుంబసభ్యులు బయటకు పొక్కనీయకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా శనివారం ఏఎన్‌ఎం, సచివాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 23, 2020 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nelloore-woman-commits-suicide-with-two-son/articleshow/74262974.cms

No comments