Breaking News

ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త


వివాహ కట్టుబాట్లను కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. ఈ ఘటన వేటపాలెంలో మంగళవారం జరిగింది. భార్య తనను మోసం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామానికి చెందిన సునీల్‌రాజ్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనూషతో అతడికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విధుల నిమిత్తం భర్తకు దూరంగా ఉండటంతో అనూష మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించి సునీల్ భార్య ప్రవర్తనపై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు బుద్ధిగా ఉంది. Also Read: ఇటీవల పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరిన అనూష ప్రియుడితో మళ్లీ సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన సునీల్‌రాజ్ మంగళవారం రాత్రి ఆమె ప్రియుడితో గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే వేటపాలెం పీఎస్‌కు వెళ్లి ఆధారాలతో సహా భార్యపై ఫిర్యాదు చేశాడు. Also Read:


By February 13, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lady-conistable-caught-red-handed-by-husband-in-prakasam-district/articleshow/74111988.cms

No comments