భార్య క్యారెక్టర్‌పై అనుమానం.. గొంతు నులిమి చంపేసి ఫ్యాన్‌కు ఉరేసిన భర్త

కట్టుకున్న భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ భర్త అడ్డంగా దొరికేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతానికి చెందిన కూరపాటి భార్గవ్ అలియాస్ రామ్, ప్రమీలకు 2009లో పెళ్లి జరిగింది. వారికి కూతురు(8), కొడుకు(రెండున్నరేళ్లు) ఉన్నారు. కొన్నాళ్ల క్రితం కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చిన భార్గవ్ ఓ సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. Also Read: భార్యపై ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భార్గవ్ ఇటీవల ఆమెతో తరుచూ గొడవపడుతున్నాడు. ఈ నెల 15వ తేదీన రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. మరుసటి ఉదయానికి ప్రమీల ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. సోదరి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: భార్గవ్‌ను విచారించగా భార్యను తానే చంపినట్లు అంగీకరించాడు. ప్రమీల వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోవడం లేదన్న కోపంతోనే గొంతు నులిమి చంపేసినట్లు చెప్పాడు. నేరం తనపై రాకుండా చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు నాటకమాడినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాడు. Also Read:
By February 24, 2020 at 11:07AM
No comments