వేధింపులతో భార్య, పోలీసుల భయంతో భర్త ఆత్మహత్య.. ఇద్దరు కుమార్తెలను కూడా
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులతో భార్య క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోగా... ఆమె ఎడబాటు తాళలేక భర్త ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రాణాలు తీసుకున్నాడు. షోళింగర్ సమీపంలోని కొడైక్కల్ గ్రామానికి చెందిన వెంకటేశన్(30), నిర్మల(23) దంపతులకు సంజన(3), రితిక(1) అనే కుమార్తెలు ఉన్నారు. వెంకటేశన్ నర్సింగ్ కోర్సు చదివి బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. నిర్మల పిల్లలతో కలిసి అత్తింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తరుచూ అత్తమామలు సూటిపోటి మాటలతో వేధిస్తుండటాన్ని నిర్మల సహించలేకపోయింది. దీనికి తోడు భర్త దూరంగా ఉండటంతో మానసికంగా కుంగిపోయింది. Also Read: దీంతో ఆదివారం ఇంట్లోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న వెంకటేశన్ వెంటనే బెంగళూరు నుంచి గ్రామానికి వచ్చాడు. విగతజీవిగా పడివున్న భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అశ్రునయనాల మధ్య భార్యకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే భార్య ఆత్మహత్య కేసులో పోలీసులు తనని ప్రశ్నించి అరెస్ట్ చేస్తారేమోనని వెంకటేశన్ భయపడ్డాడు. దీంతో సోమవారం రాత్రి ఇద్దరు కుమార్తెలతో కలిసి అమ్మోరు- ముకుందరాయపురం రైల్వే స్టేషన్‌ల మధ్య మంగళవారం రాత్రి 7-8 గంటల మధ్య నుంచి కోయంబత్తూరు వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తాను చనిపోతే పిల్లలు అనాథలుగా మారకూడదన్న ఆలోచనతోనే వెంకటేశన్ పిల్లలను కూడా రైలుకింద పడేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:
By February 05, 2020 at 09:16AM
No comments