Breaking News

Balakrishna: బాలయ్యతో సినిమా.. కస్సుమంటున్న కేథరీన్


ఒకప్పుడు వరుస సినిమాలతో మాంచి జోరుమీదుండేవారు హాట్ బ్యూటీ త్రెసా. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తమిళ సినిమాలు చేసుకుంటూ బండి నడిపించేశారు. ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సంగతి అటుంచితే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కేథరీన్‌ని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారట. ఎప్పటినుంచో దీనిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై అటు బోయపాటి టీం కానీ, ఇటు కేథరీన్ కానీ ఎన్నడూ స్పందించింది లేదు. అయితే ఇటీవల ఓ సందర్భంలో మీడియా వర్గాలు కేథరీన్‌ను బాలయ్యతో సినిమా గురించి అడిగారట. దాంతో ఆమె కాస్త కఠినంగా సమాధానం ఇచ్చారట. ‘మీరేం అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు. కావాలంటే సినిమా తీస్తున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ను అడగండి. ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఏమీ లేదు’ అని మండిపడ్డారట. అయితే తెలుగులో ఇంత గ్యాప్ రావడానికి కారణం ఆమెకు మంచి స్క్రిప్ట్స్ రాకపోవడమేనట. అందుకే తమిళం వైపు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. READ ALSO: ఇక బాలయ్య సినిమా విషయానికొస్తే.. ఇందులో ఆయన అఘోరా పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో విలన్ పాత్రలో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్‌ది విలన్ పాత్రే. సునీల్ పాత్ర బోయపాటికి చాలా నచ్చిందట. అందుకే బాలయ్య సినిమాలో ఆయన్ను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఫ్రిల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. READ ALSO:


By February 08, 2020 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/catherine-tresa-fires-after-questioning-about-film-with-bala-krishna/articleshow/74023360.cms

No comments