96 Remake: ‘జాను’ని వెంటాడుతున్న భయం.. తేడా వస్తే ఫుల్ బ్యాటింగే!
ఎవరు అవునన్నా కాదన్నా.. నిర్మాత దిల్ రాజు అనుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సిందే. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ రీమేక్ చేయాలనే ఆలోచనే పెద్ద సాహసంతో కూడుకున్నది. ఎందుకంటే తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిషలు ఈ సినిమాలో నటించారు అనేకంటే జీవించారు అనే చెప్పాలి. రామ చంద్రన్ ‘రామ్’ పాత్రలో విజయ్ సేతుపతి, జానకి ‘’ పాత్రలో త్రిష నటించారు అనేకంటే జీవించారు అనే చెప్పాలి. కథలో ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అదిరిపోయే యాక్షన్స్ ఎపిసోడ్స్ లాంటివి ఏం లేకుండా రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సాఫీగా సాగిపోయే కథతో.. కేవలం పాత్రల ద్వారా జరిగే మ్యాజిక్‌తో ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టేసింది ఈ సినిమా. ప్రేమ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్. కాగా ఇలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాని రీమేక్ అంటే ఖచ్చితంగా పోలిక ఉండనే ఉంటుంది. అయితే హీరో నాని అన్నట్టు ఎప్పుడైతే ఈ పాత్రల్ని శర్వానంద్, సమంతలు చేస్తానని ఎప్పుకున్నారో అప్పుడు తన మైండ్‌లో ‘96’ వెలిపోయి ‘జాను’ వచ్చేసింది అని అన్నారు. నిజమే.. ఇలాంటి పాత్రలు చేయాలంటే ఓ మోస్తరు నటీనటులు చేయాలేరు. ఎక్స్ ప్రెషన్స్‌తో మ్యాజిక్ చేసే , శర్వా లాంటి పరిణితి ఉన్న యాక్టర్స్‌కే సాధ్యం. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రలు చేయడానికి సమంత, శర్వానంద్‌లు కూడా భయపడి తప్పించుకునే ప్రయత్నం చేశారంటే ఆ పాత్రల్లో ఉన్న డెప్త్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి రీమేక్ సినిమాలు చేసేటప్పుడు తప్పకుండా పోలిక అనేది వస్తుంటుంది. పైగా తమిళ ఆడియన్స్ తమ హీరోలను మించి చేయలేరనే సంకల్పంతో ఉంటారు. ఇక గతంలో విడుదలైన తమిళ రీమేక్ చిత్రాల విషయంలోనూ ఇదే జరిగింది. ఇటీవల వెంకటేష్ ‘నారప్ప’ (ధనుష్- అసురన్) ఫస్ట్ లుక్ విషయంలో తమిళ జనాలు ఎంత పెద్ద రచ్చ చేశారో తెలిసిందే. నారప్పగా వెంకటేష్ అదిరిపోయే గెటప్‌తో అలరించినా.. అసలు ధనుష్‌తో పోల్చుకుంటే అదో లుక్కేనా.. ధనుష్‌ని మించిన యాక్టర్ లేరన్న రేంజ్‌లో బిల్డప్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ‘జాను’ విషయంలోనూ చిత్ర యూనిట్‌ను ఇదే భయం వెంటాడొచ్చు. పాత్రల పర్ఫెక్షన్ విషయంలో సమంత, శర్వాలు ఢోకా లేదు. అయితే ‘96’ మూవీ చాలా స్లోగా ఉంటుంది. ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయితే భయటకు రాలేం కాని.. అంతలా ఇన్వాల్వ్ చేసేలే పాత్రలు మ్యాజిక్ చేయగలగాలి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో సినిమా నడుస్తోంది. మరి ఈ సినిమాలో శర్వా-సమంత మధ్య కెమిస్ట్రీ ఎంత వరకూ పండిందన్నదీ ప్రశ్నే. పోనీ ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారంటే అదీ లేదు. కాస్త మార్పులు చేర్పులు చేసి ‘96’ మూవీ సోల్ దిబ్బతినే అవకాశం ఉండటంతో క్రిస్ప్ చేయకుండా తమిళ్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. ఇక తెలుగు తమిళ ఆడియన్స్ విషయం పక్కన పెడితే.. తెలుగు ఆడియన్స్ కూడా 96 మూవీని చాలామందే చూసి ఉంటారు. సో.. ‘జాను’ చిత్రానికి 96 మూవీకి పోలిక తప్పనిసరిగా ఉంటుంది. గతంలో ప్రేమమ్ విషయంలోనూ ఇదే జరిగింది. తమిళ ‘ప్రేమమ్’ ని కొట్టలేదబ్బ అనే విమర్శలూ వినిపించాయి. చూడాలి మరి ‘జాను’ విషయంలో ఏం జరుగుతుందో.
By February 05, 2020 at 09:18AM
No comments