Breaking News

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి... రూ.3లక్షల డిమాండ్


యువతి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బెదిరిస్తున్న యువకుడిని రాజధాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కొందరు యువకులు భట్టరహళ్లిలోని ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అందులోని ఓ యువతికి ఇటీవల మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నగరానికి చెందిన దీపక్(28) అనే యువకుడు పరిచయమయ్యాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ జనటెక్స్ కోర్సు చదువుతున్న అతడు వైట్‌ఫీల్ట్‌లోని ఓ కంపెనీలోని పార్ట్ టైమ్‌ జాబ్ చేస్తున్నాడు. ఆమె కూడా అదే కంపెనీలో పనిచేస్తుండంతో పరిచయం కాస్తా స్నేహంగా మారింది. Also Read: ఇటీవల ఆ యువతి రూమ్‌కి దీపక్ వెళ్లాడు. అదే సమయంలో ఆమె స్నాం చేసేందుకు బాత్రూమ్‌కి వెళ్లగా తన సెల్‌ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. తర్వాత ఏమీ తెలియనట్లుగా ఆమెతో మాట్లాడి తన గదికి వెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత ఆ యువతికి వాట్సాప్ ద్వారా వీడియో పంపిన దీపక్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు రూ.3లక్షలు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. Also Read: దీంతో ఆందోళన చెందిన బాధితురాలు కె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్ కనుగొని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీపక్ గతంలోనూ ఎవరిపైనా అయినా ఇలాంటి వేధింపులకు పాల్పడ్డాడా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By February 24, 2020 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bengaluru-man-arrested-while-filming-woman-in-bath-room/articleshow/74276742.cms

No comments