Breaking News

సముద్రంలోనూ కరోనా.. ఓడలో బంధీలుగా 3,500 మంది ప్రయాణికులు


ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్, సముద్రంలో ప్రయాణిస్తున్న వారినీ వదలట్లేదు. తాజాగా జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ అనే క్రూయిజ్ ప్రయాణికుల ఓడలోని వ్యక్తికి వైరస్ సంక్రమించింది. ఇదే సమయంలో ఓడలో 3,500 మందికి పైగా ప్రయాణికులు ఉండడం గమనార్హం. వీరిలో వెయ్యి మంది ఓడ సిబ్బందే ఉన్నారు. ఓడలోని వ్యక్తి హాంకాంగ్‌లో దిగిపోగా, ఆ 80 ఏళ్ల వ్యక్తికి సంక్రమించినట్లు నిర్ధరణ అయింది. దీంతో షిప్‌లోని వారికీ వైరస్ వ్యాపించిందేమోననే అనుమానాలు తలెత్తాయి. Must Read: సోమవారం డైమండ్ ప్రిన్సెస్ ఓడ యోకోహమా పోర్టులో ఆగి ఉన్నప్పుడు వైద్య నిపుణులు పరీక్షల కోసం అందులోకి ప్రవేశించారు. దీన్ని అక్కడే ఉన్న కొందరు స్థానిక జర్నలిస్టులు చిత్రీకరించారు. ఓడ 24 గంటలుగా ఆ తీరంలోనే ఉండిపోగా, అందులో నుంచి ప్రయాణికులను బయటకు అనుమతించడం లేదని బ్యాంకాక్ పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. Also Read: దీనిపై జపాన్ ప్రభుత్వ ముఖ్య అధికార ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. ఆ షిప్‌లో కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్నట్లు ధ్రువీకరించారు. ప్రయాణికులంతా వైద్య పరీక్షల కోసం తమ గదుల్లోనే ఉండాలని, వైద్య నిపుణులు అక్కడికే వచ్చి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని షిప్‌లోని ఓ యువతి స్థానిక వార్తా సంస్థకు ఫోన్‌లో వెల్లడించింది. అయితే, కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా జపాన్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది. వుహాన్ లో ఉన్న తమ దేశీయులు దాదాపు 500 మందిని తీసుకెళ్లింది. Also Read: Also Read: .


By February 04, 2020 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-in-diamond-princess-cruise-ship-passenger-in-captive-state/articleshow/73927571.cms

No comments